News August 3, 2024
భూ రెవెన్యూ చట్టాలతో నష్టపోయింది ముస్లింలే: అక్బర్

TG: నిజాం పాలన ముగిసిన అనంతరం ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివిధ రెవెన్యూ చట్టాల వల్ల ముస్లింలే ఎక్కువగా నష్టపోయారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్లో ఇప్పుడున్న ఐఎస్బీ, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల భవనాలన్నింటినీ వక్ఫ్ బోర్డు స్థలాల్లోనే కట్టారు. ఐటీ పార్కు కోసం ల్యాంకో సంస్థకు భూమి ఇస్తే అందులో ఇళ్లు నిర్మించింది. చంచల్గూడ జైల్లోనూ 30 ఎకరాల భూమి వక్ఫ్దే’ అని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2026
రేపు వడగాలుల ఎఫెక్ట్ ఎక్కడంటే?

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ కడప(D) పొట్టిపాడులో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు అల్లూరి, మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం దాదాపు 58 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News April 2, 2026
ఢిల్లీ సూపర్ విక్టరీ

IPL-2026: లక్నోతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన LSG 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (0), నిస్సాంక (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ (70*) కీలక ఇన్నింగ్సుతో తన జట్టును గెలిపించారు. స్టబ్స్ 39* పరుగులతో రాణించారు. మరో 17 బంతులు మిగిలి ఉండగానే అక్షర్ సేన విక్టరీ అందుకుంది.
News April 2, 2026
VDK ‘రణబాలి’ షూటింగ్ సీన్ లీక్

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ నుంచి ఓ సీన్ లీకైంది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో గుర్రంపై వచ్చిన విజయ్ దేవరకొండ రాయలసీమ స్లాంగ్లో మాస్ డైలాగులతో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనంతపురం జిల్లాలో జరుగుతోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న విడుదల కానుంది.


