News March 31, 2024

బీఆర్ఎస్ హయాంలో భూకుంభకోణం: కోదండరెడ్డి

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల కుంభకోణం జరిగిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ‘తుంకుంటా మండలంలో 26 ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. బొమ్మరాసిపేటలో 1065 ఎకరాల ప్రైవేటు భూమిని ధరణిని అడ్డం పెట్టుకుని వేరే వ్యక్తులకు బదలాయించారు. గజ్వేల్‌లో బినామీలకు, షాద్‌నగర్‌లో రూ.9లక్షల చొప్పున అసైన్డ్ భూములు కంపెనీలకు అప్పగించారు’ అని మండిపడ్డారు.

Similar News

News December 29, 2024

నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?

image

TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News December 29, 2024

జనవరి 1న సెలవు లేదు

image

జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది.

News December 29, 2024

హైదరాబాద్‌లో మన్మోహన్ విగ్రహం?

image

TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు హైదరాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రధాన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఉంటుందని సమాచారం. అదే విధంగా ఏదైనా పథకానికి కూడా మన్మోహన్ పేరును పెట్టొచ్చని తెలుస్తోంది. రేపు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది.