News May 10, 2024
‘ల్యాండ్ టైటిలింగ్ చట్టం’ కర్త, కర్మ బీజేపీనే: IYR
AP: రాష్ట్రంలోని విపక్షాలు విమర్శిస్తోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కర్త, కర్మ BJPనేనని మాజీ సీఎస్ IYR కృష్ణారావు వెల్లడించారు. ఆ చట్టాన్ని విమర్శిస్తూ కూటమి నేతలు కొన్ని పత్రికల్లో ఇచ్చిన ప్రకటనను ఆయన ఖండించారు. ‘ఆ యాడ్ ఇచ్చింది TDP తరఫునా లేక కూటమి తరఫునా? ఇలాంటి ప్రకటనలకు కమలం పార్టీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? AP BJP నిద్రావస్థలో ఉందా? ఇంకో కారణం ఉందా?’ అని Xలో <
Similar News
News December 26, 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వారు ప్రకటించారు.
News December 26, 2024
రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
TG: కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద భూమి ఉన్నా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో వరుసగా రెండేళ్లు ఫ్యామిలీలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే భరోసా వర్తించదని తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన భూమికే లబ్ధి చేకూర్చనుంది. పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది.
News December 26, 2024
రేపు వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన
AP: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది.