News May 8, 2024
భూమిపై సర్వహక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: జగన్

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రతిపక్షాల ఆరోపణలపై జగన్ మరోసారి స్పందించారు. ‘రాజకీయ స్వార్థంతో వారు ఇలా చేయడం దారుణం. వందేళ్ల తర్వాత సర్వే చేసి.. భూ రికార్డులు సిద్ధం చేశాం. భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం. 17వేల గ్రామాల్లో రికార్డులు పూర్తయ్యాయి. టైటిల్స్‌లో తప్పులు లేకుండా చూడటమే గ్యారంటీ. భూములకు ఇన్సూరెన్స్ ఉంది. సచివాలయాలనే రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మార్చాం’ అని వెల్లడించారు.
Similar News
News February 4, 2026
ఒక్క AI టూల్.. ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరి!

భారతీయ IT రంగానికి నేడు బ్లాక్ వెడ్నెస్ డే అనే చెప్పాలి. AIతో సాఫ్ట్‌వేర్ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన తీవ్రమవడంతో ఇన్వెస్టర్లు IT షేర్లను భారీగా అమ్మేశారు. దీంతో ఈ ఒక్కరోజే ఈ రంగంలో ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 2020 మార్చి తర్వాత ఇదే అతిపెద్ద పతనం. TCS, ఇన్ఫీ సహా అన్ని దేశీయ IT కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి ఉంది. అమెరికా AI సంస్థ ఆంత్రోపిక్ తెచ్చిన కొత్త ఆటోమేషన్ టూల్ ఈ పతనానికి దారితీసింది.
News February 4, 2026
ఆధార్ దుర్వినియోగం.. క్షణాల్లో తెలుసుకోవచ్చు!

ఆధార్ భద్రత కోసం UIDAI ‘అథెంటికేషన్ హిస్టరీ’ ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఆధార్‌ను గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అందుకోసం UIDAI సైట్‌లోని ‘My Aadhaar’ విభాగానికి వెళ్లి ‘అథెంటికేషన్ హిస్టరీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్ నంబర్, OTPతో లాగిన్ అయితే వివరాలు కనిపిస్తాయి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఫిర్యాదు చేయవచ్చు. మీ ఆధార్‌ను సురక్షితంగా ఉంచడానికి ఇది ఉత్తమ మార్గం.
News February 4, 2026
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


