News July 29, 2024
రాజకీయ స్వార్థం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు: YCP

AP: రాజకీయ స్వార్థం కోసం తప్పుడు ప్రచారం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కూటమి ప్రభుత్వం తీసివేసిందని YCP ట్వీట్ చేసింది. ‘సమగ్ర సర్వే విషయంలో యూటర్న్ తీసుకున్నారంటే దాని అర్థం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అంగీకరించినట్టే. ఈ యాక్ట్ అమలు ప్రక్రియలో సర్వే కూడా భాగమే. పథకాల పేర్లు మారిస్తేనో, బొమ్మలు తీసేస్తేనో ప్రజలకు అన్నీ చేసినట్టు కాదు. దీనివల్ల రైతులకు ఒనగూరిందేమీ లేదు’ అని పేర్కొంది.
Similar News
News January 24, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 24, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 24, 2026
వరంగల్, హన్మకొండ జిల్లాల కలయికకు బ్రేక్ పడినట్లేనా?

WGL, HNK జిల్లాలు కలుస్తాయని ఆశించిన వారి కలలు కల్లలయ్యాయి. కలిసి ఉన్న WGL, HNK పట్టణాలు.. జిల్లాలుగా మాత్రం వేరుగా ఉన్నాయి. ఈ రెండు నగరాలను అంటే వరంగల్, హన్మకొండ జిల్లాలను ఒకే జిల్లా చేయాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు ప్రభుత్వ సైతం తాజాగా అడుగులు వేసినట్లే కనిపిచింది. దీంతో రెండు జిల్లాలు ఒక్కటవుతాయనే ఆశలో ప్రజలు ఉన్నారు. అయితే, తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణతో బ్రేక్ పడినట్లయింది.
News January 24, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


