News May 2, 2024
ల్యాండర్, రోవర్ ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా గతేడాది ఆగస్టు 23న జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రుడిపై 14 రోజుల పాటు సేవలందించిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తర్వాత నిద్రావస్థలోకి వెళ్లాయి. తాజాగా ల్యాండర్, రోవర్‌ను ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ఈ మేరకు వాటిని విడుదల చేసింది. మార్చి 15న ఓ ఉపగ్రహం సాయంతో సుమారు 65KM దూరం నుంచి ఈ చిత్రాలు తీసినట్లు తెలిపింది.
Similar News
News March 15, 2026
ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.
News March 15, 2026
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.
News March 15, 2026
పిల్లలకు ఈ పోషకాలు తప్పక ఇవ్వండి

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.


