News August 31, 2024
కొండచరియలు విరిగిపడిన ఘటన దురదృష్టకరం: పవన్ కళ్యాణ్

AP: విజయవాడలో కొండచరియలు విరిగిపడి <<13984102>>నలుగురు<<>> మృతి చెందిన ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరద ప్రాంతాల్లో అధికారుల సహాయక కార్యక్రమాల్లో కూటమి శ్రేణులు పాల్గొనాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 18, 2025
నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
News November 18, 2025
బస్సుకు మంటలు.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్

AP: నెల్లూరు జిల్లా సంగం హైవేపై పెను ప్రమాదం తప్పింది. 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద మంటలు చెలరేగాయి. అదే రోడ్డుపై వెళ్తున్న సంగం కానిస్టేబుల్ నాగార్జున వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన కానిస్టేబుల్ను అభినందించారు.
News November 18, 2025
సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే?

మిగతా గృహ నిర్మాణం అంతా వాస్తు ప్రకారం ఉంటే సింహద్వారం ప్రభావం కొద్దిగా తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉంటూ సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోయినా పెద్దగా దోషం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘వ్యక్తిగత పేరు, జన్మరాశి ఆధారంగా సింహద్వారం ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. వాస్తుపరమైన ఇతర సానుకూలతలు ఈ లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>


