News August 29, 2025

శ్రీశైలంలో విరిగిపడిన కొండ చరియలు

image

భారీ వర్షాల ధాటికి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడటంతో శ్రీశైలం-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

Similar News

News August 29, 2025

పెన్షన్లు.. ఆ బాధ్యత కలెక్టర్లదే: సీఎస్

image

AP: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలని, అర్హత ఉన్నా అందకపోతే కలెక్టర్లదే బాధ్యత అని CS విజయానంద్ స్పష్టం చేశారు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. పెన్షన్ల అర్హతపై లక్షా 35 వేల మందికి నోటీసులిచ్చామని, నెల రోజుల్లో MPDOలకు అప్పీల్ చేసుకోవాలని వారికి సూచించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 88,319 మంది అప్పీల్ చేసుకున్నారని వెల్లడించారు.

News August 29, 2025

విశాఖకు గూగుల్.. 25వేల మందికి ఉపాధి!

image

AP: గూగుల్ <<17545438>>విశాఖలో<<>> నెలకొల్పే డేటా సెంటర్ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు అంచనా. ఆ సంస్థ సుమారు రూ.50వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ కూలింగ్ కోసం అత్యధిక నీరు అవసరం పడుతుంది. అందుకే సముద్ర తీరం ఉన్న విశాఖను కంపెనీ ఎంచుకుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న డేటా సెంటర్ నుంచి సముద్ర మార్గంలో వైజాగ్‌కు కేబుల్స్ తీసుకురావడం కూడా సులువవుతుంది.

News August 29, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లోనూ పాఠశాలలకు హాలిడే ఇవ్వాలనే వినతులు వినిపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని IMD సూచించింది.