News August 9, 2024

నేడు సుప్రీం కోర్టులో ‘లాపతా లేడీస్’ స్పెషల్ షో

image

సుప్రీం కోర్టు ‘75 ఏళ్ల’ వేడుకల్లో భాగంగా కోర్టు ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్’ మూవీని నేడు ప్రదర్శించనున్నారు. లింగ సమానత్వం ప్రధాన ఇతివృత్తంగా ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దీన్ని తెరకెక్కించారు. న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, రిజిస్ట్రీ సిబ్బంది ఈరోజు సాయంత్రం మూవీ చూస్తారని కోర్టు అడ్మినిస్ట్రేషన్ విభాగం తెలిపింది. ఆమిర్, కిరణ్ రావు కూడా ఈ స్క్రీనింగ్‌కు హాజరవనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

News November 27, 2025

రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

image

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.

News November 27, 2025

వైట్ ఎగ్స్‌కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్‌ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.