News July 30, 2024
ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీలు

1. టెస్లా (అమెరికా): మార్కెట్ విలువ 704 బిలియన్ డాలర్లు
2.టయాటా (జపాన్): 299 బి.డాలర్లు
3.BYD (చైనా): 97 బి.డాలర్లు
4.మెర్సిడెస్ బెంజ్ (జర్మనీ): 74 బి.డాలర్లు
5.ఫెరారీ (ఇటలీ): 73 బి.డాలర్లు
6.పోర్షే (జర్మనీ): 69 బి.డాలర్లు
7.బీఎండబ్ల్యూ (జర్మనీ): 61 బి.డాలర్లు
8.వోక్స్ వ్యాగన్ (జర్మనీ): 59 బి.డాలర్లు
9.Stellantis (నెదర్లాండ్స్): 55 బి.డాలర్లు
10.హోండా (జపాన్): 54 బి.డాలర్లు
Similar News
News November 1, 2025
వర్షం పడదంటున్నా ₹34 కోట్లతో క్లౌడ్ సీడింగ్

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ విఫలమవడం తెలిసిందే. కాన్పూర్ IITతో కలిసి మేఘమథనం చేసినా వాన పడలేదు. అయితే ఢిల్లీ వాతావరణం క్లౌడ్ సీడింగ్‌కు అనుకూలమైనది కాదని CAQM, CPCB, IMD నిర్ధారించాయని 2024లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది. అయినా ఢిల్లీ ప్రభుత్వం ₹34 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి ఇప్పటికే ₹3కోట్ల వెచ్చించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగంపై పలువురు మండిపడుతున్నారు.
News November 1, 2025
మీ కొడుకుని సూపర్ హీరోగా పెంచండి!

ప్రస్తుత టెక్‌యుగంలో పిల్లలు మంచి కన్నా చెడుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే వారికి చిన్నప్పటి నుంచే మంచి విషయాలపై అవగాహన కల్పించాలి. తోటివారిని గౌరవించడం, ఇతరుల వద్దకు వెళ్తే అనుమతి అడగడం, ఓర్పుతో ఉండటం, నిజాయతీగా మెలగడం వంటివి నేర్పాలని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల పట్ల గౌరవం, సహానుభూతి చూపడం మంచి లక్షణాలని చెప్పండి. న్యాయం కోసం నిలబడే గుణాలను నేర్పిస్తే ఆదర్శవంతుడిగా ఎదుగుతాడు.
News November 1, 2025
కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.


