News March 21, 2025

CUET UG దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) <>దరఖాస్తు<<>> గడువు రేపటితో ముగియనుంది. మార్చి 23లోగా ఫీజు చెల్లించవచ్చు. ఈనెల 24-26 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం ఉంటుంది. మే 8-జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.

Similar News

News March 23, 2025

కూటమి సర్కార్ నాపై కక్షగట్టింది: విడదల రజిని

image

AP: తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత <<15855614>>విడదల రజిని <<>>స్పందించారు. ‘నాపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. అందుకే ఆధారాలు లేకుండా కేసులు పెడుతోంది. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు భయపడను. న్యాయ పోరాటం చేస్తా’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ క్రషర్ స్టోన్ యజమానిని బెదిరించిన కేసులో రజినిపై ఏసీబీ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

News March 23, 2025

గుడ్‌న్యూస్: 100శాతం రాయితీతో రూ.50,000

image

TG: రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా చిరువ్యాపారాలు చేసే ఈబీసీలకు ప్రభుత్వం 100% రాయితీతో రూ.50వేల రుణం అందిస్తోంది. రూ.లక్షలోపు రుణాలకు 90% రాయితీ ఇవ్వనుంది. ఓ లబ్ధిదారుడు రూ.లక్ష తీసుకుంటే కేవలం రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక రూ.లక్ష నుంచి రూ.2లక్షల్లోపు రుణాలకు 80శాతం, రూ.2-4లక్షల్లోపు రుణాలకు 70శాతం రాయితీ ఇవ్వనుంది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
వెబ్‌సైట్:<> tgobmmsnew.cgg.gov.in<<>>

News March 23, 2025

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం నోటీసులు

image

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని తొలుత ఆయనకు ఆదేశాలు ఇవ్వగా స్పందించలేదు. దీంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను BRS కోరినా ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ SCని ఆశ్రయించింది. ఈనెల 25న ఈ కేసును ధర్మాసనం విచారించనుంది.

error: Content is protected !!