News October 9, 2024

గత నెల చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్‌: కోపర్నికస్

image

ఈ ఏడాది సెప్టెంబర్ చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్ అని EU వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్(C3S) తెలిపింది. అత్యంత వేడైన సెప్టెంబరు గత ఏడాది నమోదైందని గుర్తుచేసింది. గత నెలలో తీవ్ర వర్షపాతం, అమెరికాలో హెలీన్, తైవాన్‌లో క్రాతన్, యూరప్‌లో బోరిస్ తుఫాన్లు విధ్వంసాన్ని సృష్టించాయని వివరించింది. పర్యావరణ మార్పు కారణంగా పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Similar News

News February 8, 2026

జీడిమామిడిలో ‘టీ దోమ’ ఉద్ధృతి వల్ల నష్టాలు

image

జీడిమామిడి తోటల్లో ఈ సమయంలో ‘టీ దోమల’ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి లేత చిగుళ్లు, పూత, పూత కాడలు, చిన్న కాయలను ఆశించి రసం పీలుస్తాయి. ఇవి ఒక రకమైన పదార్థాన్ని వదలడం వల్ల కాయలపై, చిగుర్లపై గజ్జి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమల నివారణకు పూత మొదలై పువ్వు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు ఫలదీకరణ చెందిన తర్వాత రెండోసారి, కాయ గోళీ సైజులో ఉన్నప్పుడు మూడోసారి మందులను పిచికారీ చేయాలి.

News February 8, 2026

పన్నులు కట్టినంత మాత్రాన యజమానులు కారు: HC

image

AP: ప్రభుత్వ భూమిలో చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ఎంతకాలం నివసించినా వారు ఆక్రమణదారులేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా నివాసం ఉండి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ వారికి యాజమాన్య హక్కులు రావని తేల్చి చెప్పింది. ఓనర్‌షిప్ డాక్యుమెంట్స్ ఉన్నవారికే 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం వర్తిస్తుందని పేర్కొంది. విజయవాడ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి భూసేకరణ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

News February 8, 2026

జీడిమామిడిలో ‘టి దోమ’ను ఎలా నివారించాలి?

image

చెట్లు చిగురించినప్పుడు తొలిసారి లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ఎసిటామాప్రిడ్ 0.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. 2,3 వారాల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ల్యాండా సైహాలోత్రిన్ 0.6ML లేదా ప్రొఫెనోఫాస్ 1.5ML కలిపి పిచికారీ చేయాలి. వీటికి వేపనూనెను తగిన మోతాదులో కలిపితే మంచిది.