News June 1, 2024
చివరి దశ పోలింగ్.. అత్యల్పం, అత్యధికం ఎక్కడంటే?

సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా చివరి దశ పోలింగ్ ముగిసింది. ఇందులో బెంగాల్ 69.89% పోలింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఝార్ఖండ్(67.95%), హిమాచల్ ప్రదేశ్(66.56%), చండీగఢ్(62.80%), ఒడిశా(62.46%), పంజాబ్(55.20%), యూపీ(54%) పోలింగ్ నమోదైంది. బిహార్లో(48.86%) అత్యల్పంగా ఓటేశారు.
Similar News
News November 24, 2025
చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
News November 24, 2025
స్మృతి పెళ్లి వాయిదా.. మరో బిగ్ ట్విస్ట్!

స్మృతి మంధాన పెళ్లి వేళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు పెళ్లి వేడుకకు సంబంధించి SMలో పోస్ట్ చేసిన ఫొటోలను స్మృతి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్స్టాలో ఆ ఫొటోలు, వీడియోలేమీ కనిపించడంలేదు. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఆమె అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. నిన్న వివాహం జరగడానికి ముందు ఆమె తండ్రికి గుండెపోటు రాగా తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అనారోగ్యానికి గురయ్యారు.
News November 24, 2025
19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 19ఏళ్ల వయసులోనే 1954లో ఆయన ప్రకాశ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ వంటి ప్రసిద్ధ నటులతో పాటు విజేత, అజీత అనే కూతుళ్లు ఉన్నారు. అనంతరం 1980లో సహనటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. హేమ-ధర్మేంద్ర దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


