News December 4, 2024

గత ఏడాది BRSకు కష్టంగా గడిచింది: KTR

image

TG: బీఆర్ఎస్‌ ఏడాది కాలంగా చాలా ఎదురుదెబ్బలు, సవాళ్లు ఎదుర్కొందని KTR అన్నారు. గత ఏడాది పార్టీకి చాలా కష్టంగా గడిచిందన్నారు. ‘మీరు ఎంత గట్టిగా దెబ్బకొట్టారన్నది కాదు. ఎంత గట్టి దెబ్బ తగిలినా పోరాటం కొనసాగించడమే ముఖ్యం. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడి పోరాడుతున్నాం. KCR నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు థాంక్యూ. మరో 4 ఏళ్లు మిగిలుంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News April 4, 2026

ఇండక్షన్ స్టవ్‌ల తయారీకి ప్రభుత్వం బూస్ట్?

image

ఇండక్షన్ స్టవ్‌లు, హీటర్లు, వాటికి సరిపోయే పాత్రల తయారీని పెంచేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వివిధ డిపార్ట్‌మెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. యుద్ధం వల్ల వంట గ్యాస్ కొరత తలెత్తిన నేపథ్యంలో ఇండక్షన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.

News April 4, 2026

కాలం మారినా మన భూమి అందం మారలేదు!

image

చంద్రుడి కక్ష్యలోకి మనిషి వెళ్లిన 54 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేస్తూ NASA ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 1972లో అపోలో-17 వ్యోమగాములు తీసిన ఫొటోను, తాజాగా ఆర్టెమిస్-2 బృందం తీసిన చిత్రాన్ని పోల్చుతూ ట్వీట్ చేసింది. ‘కాలం మారినా అంతరిక్షం నుంచి మన భూమి అందం మాత్రం అస్సలు తగ్గలేదు’ అని పేర్కొంది. ఈ రెండు చిత్రాలు నాటి జ్ఞాపకాలను, నేటి సాంకేతిక అభివృద్ధిని మనకు గుర్తుచేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?

News April 4, 2026

ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. ఆ గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్లు నిషేధం!

image

TG: ఐస్‌క్రీమ్ కల్తీ నుంచి పిల్లలను కాపాడేందుకు నిజామాబాద్ జిల్లాలోని 3 గ్రామాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఐస్‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని నిషేధించాయి. ఆర్మూర్(M) అంకాపూర్, జక్రాన్‌పల్లి(M) కొలిపాక, వేల్పూర్(M) అంక్సాపూర్ గ్రామాలు దీనిపై తీర్మానం చేశాయి. నిబంధన ఉల్లంఘిస్తే ₹5వేల జరిమానా విధిస్తామని ప్రకటించాయి. ఫుడ్ సేఫ్టీ రైడ్స్‌లో ఐస్‌క్రీమ్ కల్తీలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.