News August 21, 2024
లేటరల్ ఎంట్రీ: రాహుల్ ఒకలా.. థరూర్ మరోలా

రాహుల్, ఖర్గే వ్యతిరేకించిన లేటరల్ ఎంట్రీ విధానానికి శశి థరూర్ మద్దతివ్వడం ఆశ్చర్యపరిచింది. సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్లకు పాతరేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మొదటి ఇద్దరూ విమర్శించారు. అడ్మినిస్ట్రేషన్లో అంశాల వారీగా నెలకొన్న నిపుణుల కొరతను పూడ్చాలంటే ఈ విధానమే శరణ్యమని శశి తేల్చేశారు. భవిష్యత్తులో మాత్రం రిజర్వేషన్లు, అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం నియమించుకొని సివిల్స్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.
Similar News
News December 3, 2025
కామారెడ్డి కలెక్టరేట్లో దివ్యాంగుల దినోత్సవం

కామారెడ్డి కలెక్టరేట్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సివిల్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, లోన్ల వంటి పథకాలను వివరించారు. ఈ ఏడాది స్కూటీలు, లాప్టాప్లు, ట్రైసైకిళ్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 28 మందికి లోన్లు, 15 మందికి వివాహ ప్రోత్సాహకంగా రూ.15 లక్షలు మంజూరు చేశారు.
News December 3, 2025
రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.
News December 3, 2025
లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.


