News September 1, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

★ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్.. ‘మదరాసి’ మూవీ ఈవెంట్‌లో వెల్లడి
★ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు స్పెషల్ అప్‌డేట్
★ విక్టరీ వెంకటేశ్, వీవీ వినాయక్ కాంబోలో త్వరలో సినిమా?
★ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల డైరెక్టర్ శివ నిర్వాణతో రవితేజ థ్రిల్లర్ మూవీ?

Similar News

News September 1, 2025

పురుగు మందుల పిచికారీ.. సూచనలు

image

☛ ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకోవాలి. మోతాదు కొలవడానికి మందు డబ్బాతో వచ్చిన కొలమానాన్ని వాడాలి.
☛ మందును చేత్తో కలపరాదు. ఏదైనా కర్రను ఉపయోగించాలి. ☛ పిచికారీ సమయంలో రక్షక దుస్తులు, చేతి గ్లౌజులు, ముక్కు మాస్క్, కళ్ల రక్షణ అద్దాలు ధరించాలి. పిచికారీ సమయంలో నీరు తాగటం, ఆహారం తినడం, గుట్కా తినడం, పొగ తాగడం చేయరాదు. వాడేసిన మందు డబ్బాలను గుంత తవ్వి పూడ్చి పెట్టాలి.

News September 1, 2025

రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించండి.. గవర్నర్‌కు వినతి

image

TG: స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల <<17570615>>నిబంధనను<<>> ఎత్తివేస్తూ, BCలకు రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన బిల్లును ఆమోదించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. PCC చీఫ్ మహేశ్, మంత్రులు పొన్నం, సీతక్క, BRS, CPI నేతలు అందులో ఉన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌస్ పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని కోరారు.

News September 1, 2025

చర్మానికి డ్రై బ్రషింగ్ చేస్తున్నారా..?

image

స్నానానికి ముందు శరీరాన్ని డ్రై బ్రషింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు చర్మ నిపుణులు. డ్రై బ్రషింగ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. రక్తప్రసరణను పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే డ్రై బ్రషింగ్ చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా చేస్తే చర్మంపై నొప్పి, దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మైల్డ్‌గా చేయడం ఉత్తమం.