News September 16, 2024
18న NPS వాత్సల్య పథకం ప్రారంభం

బడ్జెట్లో ప్రకటించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 18న ప్రారంభించనున్నారు. ఆరోజు ఈ స్కీమ్ విధివిధానాలను తెలియజేయనున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు ఈ NPS వాత్సల్య ఖాతాను తెరవొచ్చు. దీంతో ముందుగానే పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. చక్రవడ్డీతో పాటు అదనపు పన్ను మినహాయింపులుంటాయి. 18 ఏళ్ల తర్వాత ఇది సాధారణ NPS ఖాతాగా మారుతుంది.
Similar News
News November 16, 2025
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన ఇషా

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ కాంస్యంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో ఇషా 30 పాయింట్లు సాధించి 3వస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో 587 పాయింట్లు సాధించి అయిదో స్థానంతో ఫైనల్కు వచ్చిన ఇషా తుదిపోరులో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఛాంపియన్షిప్లో ఇషాకు ఇదే తొలివ్యక్తిగత పతకం. ఈ ఏడాది ప్రపంచకప్ స్టేజ్ టోర్నీలో ఆమె స్వర్ణం, రజతం సాధించింది.
News November 16, 2025
పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు?

TG: పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, బిల్లులు పెండింగ్లో ఉండటంతో పార్టీపరంగానే వెళ్లే అవకాశం ఉంది. దీనిపై రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు.
News November 16, 2025
న్యూస్ అప్డేట్స్ @10AM

*ఛత్తీస్గఢ్ సుక్మా(D)లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
*తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
*ఈనెల 19 లేదా DEC 7న TGలో స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు ఉచిత చీరల పంపిణీ
*మరో ఆపరేషన్ సిందూర్ జరగకూడదని, IND-PAK రిలేషన్స్ మెరుగుపడాలని ఆశిస్తున్నానన్న J&K Ex CM ఫరూక్ అబ్దుల్లా


