News November 7, 2024
16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ చట్టం: AUS PM

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు. మన దగ్గర ఇలాంటి చట్టం వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.
Similar News
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in
News December 10, 2025
అమెజాన్ భారీ పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు

ఇండియాలో ఈ-కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. మరోవైపు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ఈ-కామర్స్ ఎగుమతులను $80B వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ను కీలకమైన మార్కెట్గా భావిస్తోన్న అమెజాన్.. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 40B డాలర్ల పెట్టుబడి పెట్టింది.


