News October 13, 2024
సిద్దిఖీ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం!

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సిద్దిఖీని శనివారం ముంబైలో ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో కర్నైల్ సింగ్, ధరమ్రాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వీరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హైప్రొఫైల్ సిద్దిఖీ హత్యతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Similar News
News October 14, 2025
రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. రికీ భుయ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.
News October 14, 2025
1,968 మంది టెర్రరిస్టులను తరలించాం: ఇజ్రాయెల్

గాజా పీస్ ప్లాన్లో భాగంగా తమ అధీనంలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల విడుదల ప్రక్రియను స్టార్ట్ చేసింది. ‘దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 1,968 మంది టెర్రరిస్టులను ఓఫర్, కట్జియోట్ కేంద్రాలకు తరలించాం. అనుమతుల ప్రక్రియ ముగిశాక వారిని గాజాకు పంపిస్తాం’ అని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
News October 14, 2025
SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.