News September 11, 2025

మంచి మనసు చాటుకున్న లారెన్స్!

image

నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నై రైళ్లలో స్వీట్ అమ్ముతూ బతుకు బండిని నడిపిస్తున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్యకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష అందిస్తానని, ఆయన వివరాలు తెలిస్తే చెప్పాలంటూ Xలో ఫొటోను షేర్ చేశారు. రైలులో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయాలని కోరారు. ఫొటోలో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదని తెలిపారు.

Similar News

News March 10, 2026

ఈ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా నో ఫైన్: నిర్మల

image

PMJDYతో సహా 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్‌కు కనీస నిల్వ నిబంధన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. వీటికి మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఫైన్ ఉండదని, డిపాజిట్, విత్‌డ్రా, ATM సేవలకూ ఛార్జీలు ఉండవని తెలిపారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ మేరకు లోక్‌సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు.

News March 10, 2026

తగ్గనున్న మద్యం ధరలు.. ఎంతంటే?

image

AP: రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్, వైన్ బ్రాండ్ల ధరలను తగ్గించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. వాటి అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించనుంది. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఒక్కో సీసాపై రూ.3వేల వరకూ తగ్గనున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

News March 10, 2026

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరా?: SC

image

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా పునరావాస పథకం ఎందుకు తీసుకురాలేదని రాష్ట్రాలు, UTలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారికి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించే పథకాన్ని రూపొందించాలని ఆదేశించింది. ఉద్యోగాలు ఇవ్వడంలో ఏవైనా సమస్యలుంటే జీవన భత్యం చెల్లించేలా పాలసీ తీసుకురావాలని సూచించింది. హరియాణాకు చెందిన ఓ యాసిడ్ బాధితురాలి కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.