News April 11, 2024
కవిత అరెస్టుపై కోర్టుకు వెళ్లనున్న లాయర్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆమె లాయర్ మోహిత్ రావు కోర్టును ఆశ్రయించనున్నారు. ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రంజాన్ కారణంగా కోర్టుకు సెలవు ఉండటంతో డ్యూటీ మెజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Similar News
News January 20, 2026
TG సీఐడీ సంచలన నిర్ణయం

తెలంగాణ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం, SC/ST అట్రాసిటీ, ర్యాగింగ్ నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కేసుల్లో స్టేషన్‌కు రాలేని బాధితులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కనుంది. ఫోన్/మౌఖికంగా సమాచారం అందిస్తే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు.
News January 20, 2026
నన్ను అడగడం కాదు.. నేనే వాళ్లను ప్రశ్నలడిగా: హరీశ్ రావు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనను ప్రశ్నలడగడం కాదని, తానే వాళ్లను చాలా ప్రశ్నలు అడిగానని మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో నాకేంటి సంబంధం. నేను హోంమంత్రిగా చేయలేదు కదా. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడగండి. సిట్టు, లట్టు, పొట్టుకు మేం భయపడం. నాకు సిట్ నోటీసు ఇవ్వడం కాదు. సీఎం రేవంత్‌కు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి’ అని వ్యాఖ్యానించారు.
News January 20, 2026
ముగిసిన టెట్ ఎగ్జామ్స్.. ఈ నెల 30న ‘కీ’

TG: రాష్ట్రంలో ఈ నెల 3న ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షలు నేటితో ముగిశాయి. పేపర్-1,2కు మొత్తం 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 82.09 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం టీచర్లుగా కొనసాగుతున్నవారు టెట్ రాయాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేశారు. ఈ నెల 30న ‘కీ’, ఫిబ్రవరి 10-16 మధ్య ఫలితాలు వెలువడనున్నాయి.


