News October 6, 2025

ఆయుధాలు వీడండి.. క్యాడర్‌కు మల్లోజుల లేఖ

image

క్యాడర్‌కు సీనియర్ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖ రాశారు. ‘పార్టీలో అంతర్గతంగా చర్చించి ఆయుధాలు వీడాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. పార్టీ చేసిన తప్పిదాలతో తీవ్ర నష్టాన్ని చూశాం. ఉద్యమం ఓటమిపాలు కాకుండా కాపాడులేకపోయాం. అనవసర త్యాగాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం టీకాలాంటిది’ అంటూ 22 పేజీల <>లేఖను<<>> విడుదల చేశారు.

Similar News

News October 6, 2025

అన్ని ఫార్మాట్లలో హర్షిత్ రాణా.. ఎందుకో?

image

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 స్క్వాడ్‌లో పేసర్ హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. IPLలో KKR తరఫున ఆడటం వల్లే హెడ్ కోచ్ గంభీర్ అతడికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. పర్ఫార్మెన్స్ గొప్పగా లేకపోయినా మూడు ఫార్మాట్లలో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. షమీ, సిరాజ్ లాంటి బౌలర్లు కనిపించట్లేదా అని నిలదీస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 6, 2025

దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?

image

21వ విడత PM కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా మరో వారంలో అన్నదాతల అకౌంట్లలో ₹2K చొప్పున జమ చేయనుందని నేషనల్ మీడియా పేర్కొంది. EKYC, ఆధార్-బ్యాంక్ లింకు కాలేదంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ పంటల్లో చీడపీడల నివారణ, కొత్త విధానాలు, పాడి, జీవాలకు సంబంధించిన కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 6, 2025

ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా

image

ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నియమించిన క్యాబినెట్‌పై విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రధానిగా ఫ్రాంకోయిస్ బయ్రూ అవిశ్వాసతీర్మానంలో ఓటింగ్ ద్వారా పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.