News February 13, 2025

LBనగర్‌: ఆస్పత్రిలో మైనర్ బాలుడు మృతి.. ఆందోళన

image

మైనర్ బాలుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్‌లోని ఆరెంజ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలుడు మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 13, 2025

గాంధీభవన్‌‌లో రేపు యువజన కాంగ్రెస్ ప్రమాణం

image

రేపు గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనున్నట్లు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

News February 13, 2025

HYD: పాఠాలు చెబుతూ.. అనుకున్నది సాధించా: SI

image

మొయినాబాద్‌ SI (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. ‘నా విజయం.. నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని వివరించారు.

News February 13, 2025

అధికారులకు GHMC కమిషనర్ కీలక ఆదేశాలు

image

GHMCలోని అడిషనల్, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులను సందర్శకులు కలిసేందుకు సా. 4 నుంచి 5 గం.ల మధ్య కార్యాలయంలో ఉండాల్సిందేనని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పనిదినాల్లో ప్రజల వేదనలు వినేందుకు, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కార్యాలయంలో ఉండాలన్నారు.ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాలతో ఉండటం సాధ్యం కాకపోతే అడిషనల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

error: Content is protected !!