News April 5, 2024

శాంతిస్వరూప్ మృతికి నేతల సంతాపం

image

న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన ఆయన, న్యూస్ రీడర్‌గా తనదైన ముద్ర వేశారని రేవంత్ కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేని రోజుల్లోనే ఆయన చేసిన కృషి ఎంతోమంది వార్తా ప్రసారకులకు స్ఫూర్తినిచ్చిందని జగన్ అన్నారు. ఇక BRS చీఫ్ కేసీఆర్, TDP అధినేత చంద్రబాబు కూడా శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Similar News

News October 8, 2024

జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ట్టు కోల్పోతున్న PDP

image

JKలో PDP పట్టుకోల్పోతోంది. 2014 ఎన్నిక‌ల్లో ముఫ్తీ మొహ‌మ్మ‌ద్ సార‌థ్యంలో 28 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో 4 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. 2014లో ముక్కోణ‌పు పోటీలో హంగ్ ఏర్ప‌డింది. దీంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు BJPతో PDP చేతులుకలపడం ప్రజలకు రుచించినట్టు లేదు. JK ఓట‌ర్లు ఆ పార్టీని తిర‌స్క‌రించారు. పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె కుమార్తె ఇల్తిజా ఓటమిపాలయ్యారు.

News October 8, 2024

మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు తప్పవు: ఇరాన్

image

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News October 8, 2024

టమాటా తెచ్చిన తంటా.. 250 కి.మీ వెంబడించి!

image

ప్రస్తుతం టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిదే రైతులు, వ్యాపారస్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని ములుబాగల్‌కు చెందిన ఓ ట్రక్ డ్రైవర్ హైదరాబాద్‌లో టమాటాలు విక్రయించి తిరుగుపయనమయ్యాడు. కర్నూలు సమీపంలో టీ తాగేందుకు ట్రక్ ఆపగా ఓ దొంగల ముఠా టమాటా విక్రయించి వస్తున్న విషయం తెలుసుకుంది. 250 కి.మీ వెంబడించి సోమందేపల్లి వద్ద ట్రక్‌ను ఆపి రూ.5 లక్షలతోపాటు సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లిపోయారు.