News November 12, 2024
న్యుమోనియా గురించి తెలుసుకోండి!

ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలను తెలుసుకుందాం.
లక్షణాలు: దగ్గినప్పుడు ఛాతిలో నొప్పి. చలిగా అనిపించడం. జ్వరం రావటం. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం. ఊపిరి ఆడకపోవడం.
నివారణ చర్యలు: తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. స్మోకింగ్ చేయొద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
Similar News
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు 1/2

TG: రాష్ట్రంలో 2వేల ఏజెన్సీల పరిధిలో 4L మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఆధార్, వేతన వివరాలను EX CS శాంతికుమారి కమిటీ సేకరించింది. అయితే ఏజెన్సీలు EPF, ESIలకు నిధులు జమచేయడం లేదని గుర్తించింది. ఆ అకౌంట్ల వివరాలివ్వాలని, లేకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని తాజాగా నోటీసులిచ్చింది. ఇవి అందితే వాటి అవినీతి బాగోతం బయటపడనుంది. దీంతో ఏజెన్సీలు అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి.
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ పేరిట 12 ఏళ్లుగా నిధులు స్వాహా 2/2

TG: ఖాళీలు భర్తీకాని తరుణంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని GOVT నియమించుకుంటుంది. ఇందుకు ఏజెన్సీలకు 20% కమీషన్ 12 ఏళ్లుగా అందిస్తోంది. ఇవన్నీ గతంలో BRS నేతల బినామీల పేరిట ఏర్పాటైనవిగా తెలుస్తోంది. ఆధార్ లింక్ లేకపోవడంతో బోగస్ పేర్లతో నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. GOVT, ఉద్యోగి వాటా EPF, ESI నిధులనూ మింగేశాయి. ఇలా భారీగా దోచుకున్న సంస్థలపై ప్రభుత్వం నివేదికను రెడీ చేసింది.
News January 12, 2026
కొనసాగుతున్న రూపాయి పతనం

ఈ వారం మార్కెట్ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


