News July 18, 2024
పైథాన్ బదులు కన్నడ నేర్చుకుంటా.. నెట్టింట జోక్స్!

కర్ణాటకలోని ప్రైవేట్ కంపెనీల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు ఇస్తారని వార్తలు రావడంతో నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి. ఇక నుంచి బెంగళూరు ఐటీ కంపెనీల ఇంటర్వ్యూల్లో C++, జావా, పైథాన్ లాంటి కోర్సులు కాకుండా కన్నడ వచ్చా? అని అడుగుతారేమో అని సెటైర్లు వేస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ కోర్సులకు బదులు కన్నడ నేర్చుకుంటా అని కొందరు జోకులు వేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 27, 2025
ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.
News October 27, 2025
రెండో దశ SIR ఇలా..

* రెండో దశ <<18119730>>SIRలో<<>> భాగంగా 12 రాష్ట్రాలు, UTల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేయనున్నారు.
*5.33 లక్షల BLOలు, 7 లక్షల BLAలు పాల్గొంటారు. వీరికి ట్రైనింగ్ వెంటనే మొదలవుతుంది.
*నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా ఎన్యుమరేషన్ జరుగుతుంది. BLOలు ప్రతి ఇంటిని 3సార్లు విజిట్ చేస్తారు.
*డిసెంబర్ 8న డ్రాఫ్ట్ జాబితాలు ప్రచురిస్తారు. 2026 జనవరి 8 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురిస్తారు.
News October 27, 2025
ICU నుంచి బయటకు వచ్చిన అయ్యర్

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని Cricbuzz తెలిపింది. ఆయన కోలుకుంటున్నారని, ICU నుంచి బయటకు వచ్చారని పేర్కొంది. బీసీసీఐ టీమ్ డాక్టర్ను కేటాయించిందని, అయ్యర్ ఆరోగ్యాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. కాగా ఈ నెల 25న సిడ్నీలో జరిగిన వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ గాయపడ్డారు. అతడి ఎడమవైపు <<18117184>>పక్కటెముకల<<>> వద్ద ఉండే Spleen(ప్లీహం) అవయవానికి గాయమైంది.


