News March 24, 2024

ఆయన నుంచి చాలా నేర్చుకున్నా: గిల్

image

రోహిత్ శర్మ నుంచి చాలా నేర్చుకున్నానని గుజరాత్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన నాయకత్వంలో చాలా క్రికెట్ ఆడానని చెప్పారు. రోహిత్ నుంచి వ్యక్తిగతంగా అనేక లక్షణాలను అలవరచుకున్నానని తెలిపారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ తనకు స్ఫూర్తి అని చెప్పారు. అయితే ధోనీ నాయకత్వంలో ఆడలేకపోయానని.. విరాట్ సారథ్యంలో కొన్ని మ్యాచులు ఆడానని పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

మళ్లీ 100 డాలర్లకు ఆయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత $120 చేరువైన రేట్లు.. ఉద్రిక్తతలు ముగింపునకు వచ్చిందన్న ట్రంప్ ప్రకటనతో ఇటీవల $89కు దిగొచ్చాయి. కానీ తాజాగా హార్ముజ్‌లో చమురు నౌకలపై ఇరాన్ దాడి, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలపై దాడితో ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

News March 12, 2026

ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

image

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 12, 2026

భారత నౌకాదళంలో అగ్నివీర్ ఉద్యోగాలు

image

భారత నౌకాదళం అగ్నివీర్ (SSR) అవివాహిత పురుష, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 50% మార్కులతో 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా/వొకేషనల్ కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. DEC 2004 – OCT 2009 మధ్య జన్మించి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. MAR 14 – APR 06 మధ్య అప్లై చేయాలి. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in