News October 8, 2025
రాజకీయాలు పక్కనబెట్టండి: మంత్రి పొన్నం

TG: BCలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘దీనిపై కోర్టులో బలంగా వాదనలు వినిపించాం. సామాజిక న్యాయం అమలు దృష్ట్యా ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కనబెట్టి ఐక్యంగా ఉండాలి’ అని కోరారు. మరో మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గదు. అది రాష్ట్రమైనా రిజర్వేషన్లు అయినా. హామీ నెరవేర్చడం మా పార్టీ స్టాండ్’ అని చెప్పారు.
Similar News
News October 9, 2025
కల్తీ లిక్కరంటూ ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: CBN

AP: కల్తీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. ‘అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై YCP రాజకీయ లబ్ధికోసం రాష్ట్రమంతా దుష్ప్రచారం చేస్తోంది. ప్రాణాలు పోతున్నాయని ప్రజల్ని భయపెడుతోంది. మంత్రులు వీటిని ఖండించాలి’ అని చెప్పారు. వివేకా హత్యలో ఆడిన డ్రామాలను మరిచిపోవద్దన్నారు. ఫేక్ ప్రచారంతో ఆ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.
News October 9, 2025
వామన్‌రావు జంట హత్యకేసులో సీబీఐ దూకుడు

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి జంట హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సాక్షులను ప్రశ్నించడం ప్రారంభించింది. ఇవాళ వామన్‌రావు అనుచరులు సంతోశ్, సతీశ్‌ను విచారించింది. ఆయనతో వారి ప్రయాణం, సాన్నిహిత్యంపై ఆరా తీసింది. ఈ కేసులో గత 20 రోజులుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. మొత్తం 130 మందిని అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
News October 8, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును AICC ప్రకటించింది. ఇన్నిరోజులు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా అవకాశం మాత్రం నవీన్‌ను వరించింది. BRS పార్టీ ఇప్పటికే దివంగత MLA మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ, MIMలు పోటీ నుంచి తప్పుకున్నాయి. BJP టికెట్ ఎవరికి ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.