News May 11, 2024
ఎల్లుండి సెలవు ఇవ్వాల్సిందే: ఈసీ

TG: ఎన్నికల పోలింగ్ జరిగే మే 13వ తేదీన అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ‘సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయి. ప్రచార సమయం ముగిశాక నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదు. జూన్ 1వ తేదీ సా.6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుంది. 160 కేంద్ర బలగాలు, 60వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News January 27, 2026
ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.
News January 27, 2026
ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి ప్రయోగం

ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్నట్లు షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. ఈ ఏడాదే గగన్‌యాన్-1 తొలి మానవరహిత ప్రయోగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. G-1, G-2, G-3 మిషన్ల అనంతరం 2027 నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడతామన్నారు. ఈ ఏడాది 20-25 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఫిబ్రవరి లేదా మార్చిలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనున్నామని అన్నారు.
News January 27, 2026
పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.


