News September 23, 2024
ఉన్నపళంగా ఇళ్లు వదిలేసి వెళ్లిపోండి.. లెబనాన్ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా ఆయుధ సామాగ్రిని నిల్వ ఉంచిన ప్రాంతాల్లోని ప్రజలు ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీని కోసం ఆ దేశ పౌరులకు 80 వేల ఫోన్ కాల్స్ వచ్చినట్టు లెబనీస్ అధికారులు తెలిపారు. సోమవారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 100 మందికిపైగా మరణించినట్టు తెలుస్తోంది.
Similar News
News February 23, 2026
మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.
News February 23, 2026
ఏపీ పోలీసులపై పట్నా హైకోర్టు ఆగ్రహం

IPS సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ విషయంలో AP పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అరెస్ట్ వారెంట్ లేదా కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్ట్ చెల్లదు. కాగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నిందితుడిగా ఉన్నారు.
News February 23, 2026
EPFO గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లో నగదు జమ

EPFOలో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా యాక్టివ్‌గా లేని ఖాతాల్లోని డబ్బును చందాదారులకు ఇవ్వనుంది. 31.86 లక్షల ఇనాక్టివ్ ఖాతాల్లో ₹10,903 కోట్లున్నాయి. తొలి దశలో ₹1000 లోపు బ్యాలెన్స్ ఉన్న 7L అకౌంట్లలో పైలట్ ప్రాజెక్టుగా ఆ మొత్తాన్ని జమ చేయనుంది. తర్వాత మిగతా ఖాతాల్లో రిఫండ్ చేయనుంది. మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు.


