News March 16, 2024
HYDలో BRSను వీడుతున్నారు..!
MP ఎన్నికల వేళ కీలక నేతలు BRSను వీడుతున్నారు. MLA దానం, నందకిషోర్ వ్యాస్ INCలో చేరుతున్నట్లు టాక్. MP రంజిత్ ఇదే ఆలోచనలో ఉన్నారట. భవిష్యత్తులో భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలూ చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇటీవల BRSను వీడిన బొంతు రామ్మోహన్ GHMCలోని క్యాడర్ను INC వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల సైతం ఇదే పనిలో ఉన్నారు. దీంతో HYD BRS నేతలు ఎటువైపు అనేది చర్చనీయాంశమైంది.
Similar News
News December 4, 2024
HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు
55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.
SHARE IT
News December 4, 2024
HYDలో పెరిగిన కోడిగుడ్ల ధరలు
రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది. దీంతో HYDలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు. 4నెలల క్రితంతో పోల్చితే రూ.3 వరకు పెరిగాయి. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడంతో, క్రిస్మస్, న్యూ ఇయర్కు కేకులు తయారీలో వాడుతుండటంతో రేట్లు పెరిగినట్లు అమ్మకదారులు తెలిపారు. ధరలు మరింత పెరగుతాయని అంచనా.
News December 4, 2024
HYD: గవర్నర్ను కలిసిన మంత్రులు
రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 5వ తేదిన ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.