News May 22, 2024
KKR కోసం అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలేసి వచ్చా: గుర్బాజ్

తన తల్లి ఆస్పత్రిలో ఉన్నప్పటికీ KKR జట్టు కోసం తిరిగి ఇండియాకు వచ్చినట్లు KKR వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ చెప్పారు. తన తల్లి అనారోగ్యం కారణంగా పదిరోజుల క్రితం అఫ్గానిస్థాన్కి వెళ్లిన గుర్బాజ్.. KKR మేనేజ్మెంట్ పిలుపుతో మళ్లీ ఇండియాకు చేరుకున్నారు. కష్టమైనప్పటికీ తన తల్లి ఆశీస్సులు తీసుకొని తిరిగొచ్చినట్లు మీడియాతో చెప్పుకొచ్చారు. SRHతో మ్యాచ్లో 14 బంతుల్లో 23 పరుగులు చేశారు.
Similar News
News January 19, 2026
పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?
News January 19, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 19, 2026
బొగ్గు టెండర్ల పంచాయితీ.. నివేదిక కోరిన కేంద్రం!

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పాలసీ పరమైన లోపాలు జరిగినట్లు సమాచారం అందడంతో టెండర్ల ప్రక్రియ వివరాలు సమర్పించాలని సింగరేణిని కోరింది. సింగరేణిలో బొగ్గు మంత్రిత్వ శాఖకు 49%, తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉంది. బొగ్గు శాఖ నైనీ బ్లాకులను ఎస్సీసీఎల్కు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2025లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.


