News December 9, 2024

తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మారిస్తే చట్టపరమైన చర్యలు: సీఎం

image

TG: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు CM రేవంత్ తెలిపారు. ‘భవిష్యత్తులో విగ్రహ నమూనా మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని చూసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. విగ్రహం మార్పు వల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని కొందరు భయపడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు.

Similar News

News November 19, 2025

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న PM మోదీ

image

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు. 22, 23 తేదీల్లో నిర్వహించనున్న 20వ G-20 సదస్సులో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘G-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జొహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని 3 సెషన్లలో ప్రసంగిస్తారు. వివిధ నేతలతోనూ భేటీ అవుతారు. ఇది ఓ గ్లోబల్ సౌత్ దేశంలో వరుసగా నాలుగోసారి జరుగుతున్న G-20 సదస్సు’ అని పేర్కొంది.

News November 19, 2025

అకౌంట్లో డబ్బులు పడలేదా.. ఇలా చేయండి

image

AP: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రాష్ట్రంలో ఇవాళ 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,200 కోట్లు <<18330888>>జమ<<>> చేశారు. కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల చొప్పున విడుదల చేశాయి. అకౌంట్లలో డబ్బులు పడనివారు <>వెబ్‌సైట్లోకి<<>> వెళ్లి ‘నో యువర్ స్టేటస్’పై క్లిక్ చేస్తే పెండింగ్‌లో పడిందా, రిజెక్ట్ అయిందా తెలుస్తుంది. తర్వాత పూర్తి వివరాలకు మీ గ్రామ సచివాలయంలో సంప్రదించండి.

News November 19, 2025

మహేశ్, నమ్రతల్ని కొడతా.. మంచు లక్ష్మి సరదా కామెంట్స్

image

తమ కుమార్తెలు సినిమాల్లోకి రాకుండా మేల్ యాక్టర్స్ నిరుత్సాహ పరుస్తున్నారని నటి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘యాక్టర్స్ డాటర్స్’ సినిమా రంగంలో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. మహేశ్, నమ్రతల స్టార్ కిడ్ సితారకు మంచి విజిబులిటీ ఉందన్నారు. ‘నమ్రత ప్రగతిశీల మహిళ. స్త్రీలను ఎలా పైకి తేవాలో ఆమెకు తెలుసు’ అని పేర్కొన్నారు. సితారను బయటకు తీసుకురాకుంటే వారిద్దర్నీ కొడతానని సరదాగా వ్యాఖ్యానించారు.