News July 5, 2024
పోస్టుల పెంపుతో న్యాయపరమైన చిక్కులు: CMO

TG: గ్రూప్-1 మెయిన్స్ సెలక్షన్ను 1:50 నిష్పత్తికి బదులుగా 1:100కి మారిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తి నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉందని CMO ప్రకటనలో తెలిపింది. అలాగే పరీక్ష ప్రక్రియ కొనసాగుతున్నందున గ్రూప్-2, 3 పోస్టుల పెంపు సాధ్యపడదని తెలిపింది. ఒకవేళ గ్రూప్-1 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచే అవకాశం ఉన్నా గ్రూప్-2, 3కి అలాంటి సౌకర్యం లేదని పేర్కొంది.
Similar News
News November 22, 2025
సమీకృత దాణాతో పశువులకు కలిగే మేలు

పశువుల పోషణలో భాగంగా పాడిపశువులకు సమతుల ఆహారం అందించడం ముఖ్యం. రోజూ అందించే దాణాతో పాటు సమీకృత దాణా కూడా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉన్న దినుసులను తగిన మోతాదులో కలిపి సమీకృత దాణాను తయారు చేయవచ్చు. ఇలా స్వయంగా తయారు చేసుకున్న దాణాలో మెులాసిస్ అరోమా పొడిని 250-500 గ్రాములు కలిపితే దాణా సువాసన కలిగి, రుచిగా ఉంటుంది.
News November 22, 2025
గుడిలో దండలు మార్చుకుని.. IASల ఆదర్శ వివాహం

AP: పెళ్లంటే ఆర్భాటం కాదు అర్థం చేసుకోవడమేనని నిరూపించారు ఇద్దరు ఐఏఎస్లు. విశాఖ కైలాసగిరి శివాలయంలో నిరాడంబరంగా దండలు మార్చుకుని, తర్వాత సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి దంపతులయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీపూజ, మేఘాలయలోని దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మల వివాహ తంతు ఇలా సింపుల్గా పూర్తయ్యింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం విశేషం.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.


