News November 15, 2024
టెస్ట్ క్రికెట్‌కు లెజెండరీ బౌలర్ గుడ్‌బై

న్యూజిలాండ్ లెజెండరీ పేస్ బౌలర్ టిమ్ సౌథీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. హామిల్టన్‌లోని తమ హోం గ్రౌండ్ సెడాన్ పార్క్‌లో ఆయన ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రిటైర్మెంట్ ప్రకటన చేయనున్నారు. సో, అదే ఆయనకు చివరి టెస్టు సిరీస్. 35ఏళ్ల సౌథీ న్యూజిలాండ్ తరఫున 104 టెస్టులు ఆడి 385 వికెట్లు పడగొట్టారు. ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన 15 సార్లు, 10 వికెట్ల ప్రదర్శన ఒకసారి చేశారు.
Similar News
News February 1, 2026
కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/
News February 1, 2026
40% GST.. భారీగా పెరిగిన ధరలు

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.
News February 1, 2026
నిర్మలమ్మ పద్దు.. ₹54 లక్షల కోట్లు?

2026-27 కేంద్ర బడ్జెట్ ₹54 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 7.9 శాతం ఎక్కువని చెబుతున్నాయి. 2025-26లో కేంద్రం ₹50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరోవైపు జీతం తీసుకునే వ్యక్తులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కనీసం రూ.15 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల నుంచి 90 వేలకు పెంచే అవకాశం ఉందని సమాచారం.


