News April 16, 2024

దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

image

ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరెక్ అండర్‌వుడ్(78) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1966-82 మధ్య ఇంగ్లండ్ తరఫున 86 టెస్టుల్లో 297, 26 వన్డేల్లో 32 వికెట్లు తీశారు. ఇప్పటికీ ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు ఆయన పేరిటే ఉంది. కాగా కౌంటీల్లో 900కు పైగా మ్యాచులు ఆడిన డెరెక్ 2,523 వికెట్లు తీశారు.

Similar News

News April 4, 2026

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ఎవరికో అవకాశం?

image

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీతో పాటు కొందరి శాఖలు కూడా మారతాయని చర్చ జరుగుతోంది. కొత్తగా ఒక BC, ST ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక మంత్రి పదవి చేపట్టిన అజహరుద్దీన్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన MLC అవుతారా? లేదా? అన్నది సందిగ్ధంలో పడింది.

పాక్‌లో రూ.80 తగ్గిన లీటర్‌ పెట్రోల్ ధర

image

పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటిన పెట్రోల్ రేట్ ఏకంగా 80 PKR(పాకిస్థాన్ రూపీ) తగ్గింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇటీవల లీటర్ <<19554325>>పెట్రోల్<<>> ధర 458 PKR, లీటర్‌ హైస్పీడ్ డీజిల్ ధర 520 PKRకు చేరింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. PM షెహబాజ్ షరీఫ్ వెంటనే 80 PKR తగ్గిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాక్‌లో ఇప్పటికే అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.