News January 9, 2025
దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి

మలయాళ దిగ్గజ గాయకుడు పి జయచంద్రన్(80) ఈరోజు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్కు 5సార్లు కేరళ రాష్ట్ర పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.
Similar News
News December 1, 2025
భారీ జీతంతో ECGC లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECGC)లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, MA(హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. DEC 15నుంచి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.
News December 1, 2025
భక్తికి, నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’

నిర్గుణోపాసన, నిరంతర నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’. ఈ పవిత్ర స్థలంలోనే శబరి మాత కఠోర భక్తితో అయ్యప్ప స్వామి దర్శనం పొందింది. ఈ పీఠానికి దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. పూర్వకాలంలో, పందళ రాజవంశీయులు ఇక్కడ ఓ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి విద్యనభ్యసించారని ప్రతీతి. భక్తికి, నిరీక్షణకు గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ ప్రదేశం అయ్యప్ప స్వాములకు పరమాత్మ దర్శనానికి మార్గాన్ని చూపిస్తుంది. <<-se>>#AyyappaMala<<>>
News December 1, 2025
WhatsApp: కొత్త నిర్ణయంతో తిప్పలు తప్పవు!

కేంద్రం తెస్తున్న <<18424391>>‘సిమ్ బైండింగ్’<<>> రూల్ కొందరు వాట్సాప్ యూజర్లపై ప్రభావం చూపనుంది. ఏ నంబర్‌తో యాప్ వాడితే సిమ్ ఆ మొబైల్లో ఆన్‌లో ఉండాలనే రూల్‌తో ఫారిన్ ట్రిప్స్ వెళ్లే వారికి, సిమ్ లేని వారికి ఇబ్బందే. ప్రస్తుతం ఆఫీస్ నంబర్‌తో లింకైన అకౌంట్లు మల్టిపుల్ డివైజ్‌లలో లాగిన్‌లో ఉంటాయి. కానీ ప్రతి 6గం.కు వెబ్ వర్షన్స్ ఆటో- లాగౌట్ నిర్ణయంతో రి-లాగిన్, చాట్స్ లోడింగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్.


