News October 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 26

image

1. రాముడు ఏ వంశానికి చెందినవాడు?
2. ఉత్తర, అభిమన్యుల కుమారుడు ఎవరు?
3. విష్ణువు కాపలదారులు ఎవరు?
4. కార్తికేయ స్వామికి ఎన్ని తలలుంటాయి?
5. హనుమాన్ చాలీసా రచయిత ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#IthihasaluQuiz<<>>

Similar News

News October 5, 2025

ఒకప్పటి హీరోహీరోయిన్లు ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

చెన్నైలో జరిగిన 80వ దశకం సినీ తారల రీయూనియన్లో స్టార్ నటీనటులు పాల్గొన్నారు. ఆనాటి హీరోలు, హీరోయిన్లంతా స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌లో మెరిశారు. ఆరుపదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి Xలో షేర్ చేశారు. ‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులను కలిసినప్పుడల్లా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ప్రతి సమావేశం మొదటిదానిలానే కొత్తగా అనిపిస్తుంది’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

News October 5, 2025

వంటింటి చిట్కాలు

image

✍️ మటన్ మెత్తగా ఉడకాలంటే చిన్న కొబ్బరి ముక్కను పెంకుతో సహా వేయాలి. మాంసం కూరలో నీరు ఎక్కువైతే చెంచా కాన్‌ఫ్లవర్ కలిపి ఉడికిస్తే చిక్కబడి రుచిగా ఉంటుంది.
✍️ పూరీల పిండిలో 4 చెంచాల పెరుగువేసి బాగా కలిపితే పూరీలు నూనె తక్కువ పీల్చుకుంటాయి. అలాగే బంగారు రంగులో మెరుస్తూ పొంగుతాయి.
✍️ వాష్ బేసిన్‌లో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేడి నీటిలో కాస్త ఉప్పు కలిపి పోస్తే శుభ్రమవుతుంది.
<<-se>>#VantintiChitkalu<<>>

News October 5, 2025

కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు?

image

ఆహ్లాదకర వాతావరణంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేయగా, ఆ మధుర నాదానికి పరవశించి నెమళ్లు ఆయన చుట్టూ చేరాయి. కృష్ణుడు నాట్యం చేస్తుండగా అవి ఆయన అడుగుల లయను అనుసరించాయి. పురివిప్పి నృత్యం చేయడం నేర్చుకున్నాయి. అలా కృష్ణుడు వాటికి గురువయ్యాడు. నెమళ్లు గురుదక్షిణగా పింఛాన్ని సమర్పించాయి. ఆ పింఛాన్ని ధరించిన కృష్ణుడు తన రూపాన్ని మరింత శోభాయమానం చేసుకున్నాడు. <<-se>>#DharmaSandehalu<<>>