News October 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 28

image

1. రాముడు పాలించినప్పుడు కోసల దేశపు రాజధాని ఏది?
2. కురుక్షేత్రంలో శల్యుడు ఎవరి రథ సారథి?
3. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
4. వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడిన భక్తుడు ఎవరు?
5. తెలంగాణలో బోనాల పండుగను ఏ తెలుగు మాసంలో జరుపుకొంటారు?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News March 14, 2026

NDAతో పొత్తు ఉండదు: విజయ్

image

TNలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో NDAతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. వారితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలే అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. BJP తమకు సైద్ధాంతిక శత్రువు అన్నారు. పార్టీ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలని కార్యకర్తలకు సూచించారు.

News March 14, 2026

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్!

image

TG: హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యే రీజినల్ రింగురోడ్డు వెంబడే రీజినల్ రింగ్ రైల్ (RRR) ఏర్పాటుకానుంది. దీని DPR కోసం సర్వేకి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ లోక్‌సభలో MP కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్, ఆర్థికశాఖ అనుమతి తరువాత దీనికి తుది అనుమతి లభించనుంది. దీనివల్ల HYD చుట్టూ ఉన్న ప్రాంతాలకు రవాణా సులభం అవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.

News March 14, 2026

OTP పద్ధతిలోనే సిలిండర్: పయ్యావుల

image

AP: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశామన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా OTP పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెరగకుండా చూస్తున్నామన్నారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.