News October 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 28 సమాధానాలు

image

1. రాముడు పాలించినప్పుడు కోసల దేశపు రాజధాని ‘అయోధ్య’.
2. కురుక్షేత్రంలో కర్ణుడి రథసారథి శల్యుడు.
3. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి.
4. వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడింది హథీరాం బావాజీ.
5. తెలంగాణలో బోనాల పండుగను ఆషాడ మాసంలో జరుపుకొంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News October 7, 2025

గుడ్‌న్యూస్.. ఫ్రీగా ట్రైన్ టికెట్ తేదీల మార్పు

image

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కన్ఫామైన ట్రైన్ టికెట్ డేట్స్‌ను ఇకపై ఫీజు లేకుండా మార్చుకునేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. JAN నుంచి ఇది అమల్లోకి వస్తుందని, టికెట్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే కొత్త తేదీల్లో టికెట్ కన్ఫర్మేషన్‌కు గ్యారంటీ ఇవ్వలేమన్నారు. అటు దీపావళికి దేశవ్యాప్తంగా 12,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.

News October 7, 2025

కాంతార డ్రెసప్‌తో దైవాన్ని అపహాస్యం చేయొద్దు: రిషబ్ శెట్టి

image

‘కాంతార’ దైవ వస్త్రధారణతో అభిమానులు థియేటర్లలోకి రావడం, వీడియోలను SMలో పెట్టడం సరికాదని నటుడు రిషబ్ శెట్టి తెలిపారు. ఫ్యాన్స్ ఇలా చేయడం బాధిస్తోందని పేర్కొన్నారు. ఇది దైవాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. ‘మేం చాలా పవిత్రంగా దైవ పాత్రలను సినిమాలో చూపించాం. ఎమోషన్స్ కోసం కొన్ని సన్నివేశాలు, దృశ్యాలను మూవీలో పెడుతుంటాం. SMలో వైరలవ్వడం కోసం కొందరు ఇలా చేయడం మానుకోవాలి’ అని కోరారు.

News October 7, 2025

గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ

image

TG: గ్రూప్-1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు <<17813238>>ఆదేశాలపై<<>> స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పే ఇచ్చినందున జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.