News October 9, 2025

ఇతిహాసాలు క్విజ్ – 30

image

1. అశోకవనంలో సీతాదేవికి అండగా ఉండి, ధైర్యం చెప్పిన రాక్షస స్త్రీ ఎవరు?
2. శ్రీకృష్ణుడి శంఖం పేరేంటి?
3. భాగవతం రాయమని వేద వ్యాసుడిని ప్రేరేపించింది ఎవరు?
4. సూర్యుడి వాహనం ఏది?
5. ఏకోన వింశతి: అంటే ఎంత?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News October 9, 2025

జగన్ పర్యటన వేళ పోలీసుల సూచనలు

image

AP: మాజీ సీఎం జగన్ ‘చలో నర్సీపట్నం’ పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సూచనలు చేశారు. నిర్వాహకులు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. హైవేలు, కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా జన సమీకరణ చేయకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనూ సామర్థ్యానికి మించి జనాలను సమీకరించకూడదని పేర్కొన్నారు.

News October 9, 2025

7,267 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రిన్సిపల్, PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా పాసైన వారు అర్హులు. అప్లైకి చివరి తేదీ OCT 23. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్:
https://nests.tribal.gov.in

News October 9, 2025

ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష!

image

కులవివక్ష రాజకీయాల్లోనే కాదు అధికారులనూ పట్టిపీడిస్తోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సీనియర్ అధికారులు వేధిస్తున్నారని తెలుగువాడైన హరియాణా ADGP పూరన్ కుమార్ 8 పేజీల లేఖ రాసి ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు శాఖలో కులవివక్షతో పాటు అక్రమాలపై గళమెత్తడంతో ఉన్నతాధికారులు తనను నాశనం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. లంచం కేసులోనూ ఇరికించారని తుపాకీతో కాల్చుకున్నారు. ఆయన భార్య అమనీత్ IAS.