News October 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 34

1. రామాయణంలో అతిపెద్ద కాండము ఏది?
2. మహాభారతం రాయడానికి వ్యాసుడికి ఎంత కాలం పట్టింది?
3. విశాలాక్షుడు అని ఎవర్ని అంటారు?
4. ‘పితృ పక్షం’ అనేది ప్రధానంగా ఏ రెండు పండుగల మధ్య వస్తుంది?
5. భౌమ వారం అంటే ఏ వారం?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News October 13, 2025
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

TG: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్‌గూడలోని ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి APలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు పలు పదవుల్లో పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
News October 13, 2025
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 82,229 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 25,209 వద్ద ట్రేడవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News October 13, 2025
నాలుగో రోజు ప్రారంభమైన ఆట

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఫాలో ఆన్ ఆడుతున్న WI 93 పరుగుల వెనుకంజలో ఉంది. నిన్న 35కే రెండు వికెట్లు కోల్పోయినా క్యాంప్‌బెల్(90), హోప్(67) క్రీజులో నిలదొక్కుకొని 138 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం WI స్కోర్ 177/2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.