News October 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 42 సమాధానాలు

image

1. వాలి ఇంద్రుడి అంశతో జన్మించాడు.
2. కర్ణుడి అంత్యక్రియలను యుధిష్ఠిరుడు నిర్వహించాడు.
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత సరస్వతీ దేవి.
4. త్రిమూర్తులలో లయకారుడు ‘శివుడు’.
5. వాయు లింగం శ్రీకాళహస్తి ఆలయంలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News October 21, 2025

విపక్ష అభ్యర్థులకు NDA బెదిరింపులు: PK

image

ఓటమి భయంతో NDA కూటమి విపక్ష అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి విత్‌డ్రా చేయిస్తోందని JSP అధినేత ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఇలాగే వైదొలిగారని చెప్పారు. ‘NDA 400 సీట్లు పైగా గెలుస్తుందని గొప్పలు చెప్పుకొని 240 సీట్లకు పరిమితమైనా BJPకి ఇంకా గుణపాఠం కాలేదు. సూరత్ మోడల్‌ను అనుసరించాలనుకుంటోంది’ అని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, EC జోక్యం చేసుకోవాలని కోరారు.

News October 21, 2025

రికార్డుల మోత.. దీపావళికి ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం

image

దేశవ్యాప్తంగా దీపావళి మోత మోగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 25 శాతం (రూ.4.25 లక్షల కోట్లు) సేల్స్ పెరిగినట్లు CAIT సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. 87% మంది స్వదేశీ ఉత్పత్తులనే ఇష్టపడుతున్నారని, దీంతో చైనా ప్రొడక్టులకు డిమాండ్ తగ్గిందని తెలిపారు.

News October 21, 2025

బాణసంచా కార్మికులకు బీమా ఉండాల్సిందే: CM

image

AP: కోనసీమ (D) రాయవరంలో బాణసంచా <<17957968>>పేలుడు<<>> ఘటనలో మృతులకు ₹15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని CBN ఆదేశించారు. ఒకే షెడ్డులో 14 మంది మాన్యుఫ్యాక్చరింగ్ చేశారని, హార్డ్ మెటీరియల్ వాడడంతో స్పార్క్ వచ్చి ప్రమాదం జరిగిందని అధికారులు నివేదించారు. బాణసంచా తయారీదారులు నిబంధనలు పాటించకుంటే PD కేసులు పెట్టాలని CM ఆదేశించారు. కార్మికులకు వ్యక్తిగత బీమా ఉండాలన్నారు.