News December 16, 2024
శాసనసభ రేపటికి వాయిదా

TG: అసెంబ్లీలో పర్యాటకంపై చర్చ జరుగుతుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభా మర్యాదలు పాటించాలని, సభాపతిని గౌరవించాలని విపక్ష నేతలను స్పీకర్ కోరారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని సూచించారు. మరోవైపు తమకు మాట్లాడే సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. నిరసనల నడుమ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Similar News
News October 26, 2025
సజ్జనార్ డీపీ పెట్టుకుని..

TG: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే IPS ఆఫీసర్ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లో సజ్జనార్ డీపీ పెట్టుకుని మెసేజులు పంపుతున్నారు. అలాంటి మెసేజులకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు అసలే ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపవద్దని హెచ్చరించారు.
* సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930
News October 26, 2025
RTC, ప్రైవేట్ బస్సులకు తేడా ఏంటి?

ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు ఉంటారు. డ్యూటీకి ముందు ప్రతి డిపోలో ఆల్కహాల్ టెస్టు చేస్తారు కాబట్టి మద్యం తాగి బస్సు నడిపే అవకాశం ఉండదు. బస్సుకు స్పీడ్ లాక్ ఉండటంతో గంటకు 80 కి.మీ. వేగాన్ని దాటి వెళ్లలేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్లు రాత్రి వేళ్లలో గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగే అవకాశమూ ఉంది.
News October 26, 2025
DRDOలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా?

<


