News April 16, 2024

గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత: రేవంత్ రెడ్డి

image

TG: గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టబద్ధమైన ఏజెంట్ల ద్వారా మాత్రమే కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లేలా చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని పేర్కొన్నారు. ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్స్, కేరళలో మంచి విధానం అమల్లో ఉందని, అన్నీ అధ్యయనం చేసిన తర్వాత సమగ్ర విధానం రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News April 8, 2026

ఈ రాత్రికే అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం?

image

అమెరికా, ఇరాన్ మధ్య ఈ రాత్రికే ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు CNN నివేదిక వెల్లడించింది. ఇక తాము శాంతి, యుద్ధం రెండింటికీ సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. అలాగే పాక్ చేసిన రెండు వారాల సీజ్ ఫైర్ రిక్వెస్ట్‌పై కూడా ఆ దేశం సానుకూలంగా రివ్యూ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా ట్రంప్ హయాంలో ఇరాన్ టెర్రరిజం కొనసాగదని, అంతం అవుతుందని వైట్ హౌస్ ట్వీట్ చేసింది.

News April 8, 2026

ట్రంప్ డెడ్‌లైన్‌ను పొడిగిస్తారా?

image

ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో 3 గంటల్లో ముగియనుంది. అయితే ఇరాన్‌తో తీవ్ర చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ మీడియాకు చెప్పారు. మరోవైపు 2 వారాలపాటు డెడ్‌లైన్ పొడిగించాలన్న పాక్ విజ్ఞప్తిని ట్రంప్‌కు తెలియజేశామని, దీనిపై ఆయన త్వరలో స్పందిస్తారని వైట్‌హౌస్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెడ్‌లైన్‌ను పొడిగిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

News April 8, 2026

US, ఇరాన్ వార్నింగ్స్.. గల్ఫ్ దేశాల్లో అలర్ట్!

image

US, ఇరాన్ పరస్పర హెచ్చరిక నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అలర్ట్ అయ్యాయి. 6 గంటలపాటు ఇళ్లలోనే ఉండాలని కువైట్ తమ దేశ ప్రజలకు సూచించింది. ఇక ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. అటు ఖతర్‌లో థ్రెట్ అలర్ట్ జారీ చేశారు. అధికారుల సూచనలు పాటించాలని అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. సౌదీ అరేబియాకు రావొద్దని, హజ్ యాత్రను విరమించుకోవాలని US ఎంబసీ తమ దేశస్థులకు సూచించింది.