News March 3, 2025
భక్తులపై చిరుతల దాడులు.. టీటీడీ కీలక నిర్ణయం?

AP: శ్రీవారి భక్తులపై చిరుతల దాడులను అరికట్టేందుకు TTD కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్‌లోని చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులకు యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఆ జంతువుల కదలికలను గుర్తించవచ్చు. అవి జన సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తమై దూరంగా తరమవచ్చు. వాటిని ట్రాప్ చేసి పట్టుకుని సిమ్‌తో కూడిన రేడియో కాలర్ సిస్టమ్‌ను అమర్చుతారు.
Similar News
News December 6, 2025
పెంచలకోనలో విశేష పూజలు

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
News December 6, 2025
బిగ్‌బాస్-9: రీతూచౌదరి ఎలిమినేట్?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా మారింది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నామినేషన్లలో ఆరుగురు ఉండగా నలుగురు సేవ్ అయ్యారు. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే అంతా సుమనే ఎలిమినేట్ అవుతారని భావించగా తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది.
News December 6, 2025
మూతపడిన రామగుండం థర్మల్ స్టేషన్

TG: రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ మూతపడింది. 1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్ 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్ జీవితకాలం ముగిసిందని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఈ యూనిట్ నుంచే విద్యుత్ సరఫరా చేశారు.


