News December 31, 2024
Infosys క్యాంపస్‌లోకి చిరుత.. ఉద్యోగులకు WFH

Infosys మైసూర్ క్యాంపస్‌లో చిరుత కలకలం రేపింది. మంగళవారం దీన్ని క్యాంపస్‌లో గుర్తించినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సంస్థ మెసేజ్‌లు పంపింది. బయటి నుంచి ఎవరినీ క్యాంపస్‌లోకి అనుమతించవద్దన్న భద్రతా సిబ్బంది ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే చిరుత ఆచూకీ ఇంకా దొరకలేదని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.
Similar News
News December 3, 2025
కోటి మంది ఫాలోవర్లను కోల్పోయాడు

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో X(ట్విటర్)లో 10 మిలియన్ల(కోటి) ఫాలోవర్లను కోల్పోవడం నెట్టింట చర్చనీయాంశమైంది. నవంబర్‌లో 115M ఫాలోవర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 105Mకు చేరింది. దీనికి ప్రధాన కారణం ఫేక్ అకౌంట్ల తొలగింపేనని తెలుస్తోంది. అటు NOV 18న ట్రంప్‌తో రొనాల్డో భేటీ ప్రభావం చూపించి ఉండొచ్చని సమాచారం. ట్రంప్ అంటే నచ్చని వారికి వారి మీటింగ్ కోపం తెప్పించిందని తెలుస్తోంది.
News December 3, 2025
ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్‌లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్‌ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.


