News February 16, 2025

చిరుత సంచారం.. అలిపిరి మార్గంలో ఆంక్షలు

image

AP: చిరుత సంచారం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్లే వారి రక్షణ దృష్ట్యా TTD ఆంక్షలు విధించింది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉ.5 నుంచి మ.2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తోంది. అనంతరం 70-100 మందితో గుంపులుగా వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు. 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి మార్గం మూసివేస్తున్నారు.

Similar News

News January 2, 2026

కలరింగ్‌కు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

image

* జుట్టును శుభ్రంగా కడిగిన తర్వాతే కలరింగ్‌ చేయాలి. మురికిగా, జిడ్డుగా ఉంటే వెంట్రుకలకు రంగు సరిగా అంటుకోదు. ఇలా వేసిన రంగు ఎక్కువ కాలం నిలవదు. * కొత్త బ్రాండ్‌ను వాడే ముందు మీ మోచేయి దగ్గర ఆ రంగును అద్ది ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి దురద, మంట వంటి రియాక్షన్‌ లేనట్లయితేనే జుట్టుకు వాడండి. * తలపై గాయం, పుండు, దురద ఉన్నట్లయితే కలరింగ్‌ చేయకండి. దీనివల్ల సమస్య పెరిగే ప్రమాదం ఉంది.

News January 2, 2026

45.5 లక్షల కార్ల విక్రయం.. SUVలదే హవా

image

దేశీయ ఆటో రంగం 2025లో కొత్త చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో 45.5 లక్షల కార్ల విక్రయమై, గత ఏడాదితో పోలిస్తే 6% వృద్ధి నమోదైంది. GST 2.0 సంస్కరణలతో అమ్మకాలు మరింత వేగంగా జరిగాయి. మారుతి సుజుకీ 18.44 లక్షల కార్ల విక్రయాలతో టాప్‌లో నిలిచింది. మహీంద్రా, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తం అమ్మకాల్లో 55.8% వాటాతో SUVలు అగ్రస్థానంలో నిలిచాయి.

News January 2, 2026

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, NTC, సైన్స్ గ్రాడ్యుయేట్(ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.tifr.res.in