News November 2, 2024
నవంబర్లో చలి తక్కువే: వాతావరణశాఖ

సాధారణంగా నవంబర్ రాగానే చలి గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. నవంబర్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది. నవంబర్లో చలికి వాయవ్య భారతదేశం నుంచి వీచే గాలులే కారణం కాగా ఈసారి అక్కడ గాలులు వీచకపోవడంతో చలి ఎక్కువగా ఉండే అవకాశం లేదంది.
Similar News
News November 1, 2025
వెనిజులాపై దాడులు చేస్తారా? ట్రంప్ ఏమన్నారంటే

వెనిజులాలో కొకైన్ ఫెసిలిటీస్, డ్రగ్ ట్రాఫికింగ్ రూట్లపై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వచ్చిన <<18162638>>వార్తలను<<>> ప్రెసిడెంట్ ట్రంప్ ఖండించారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. మరోవైపు కరీబియన్, ఈస్టర్న్ పసిఫిక్లో గత నెల నుంచి ఇప్పటివరకు 15 అనుమానిత డ్రగ్ స్మగ్లింగ్ బోట్లపై యూఎస్ దాడులు జరిపింది. ఈ ఆపరేషన్లలో ఇప్పటివరకు 61 మంది మరణించారు. కాగా పడవలపై దాడుల్ని ఆపేయాలని USను UN కోరింది.
News November 1, 2025
నేడు శ్రీసత్యసాయి జిల్లాలో CM CBN పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లిలో మ.12.45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించనున్నారు. పెన్షన్ లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.
News November 1, 2025
పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

‘బాహుబలి’ యూనివర్స్లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్పై మీరేమంటారు?


