News December 27, 2024
మాటలు తక్కువ.. పని ఎక్కువ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.
Similar News
News December 27, 2024
రేపు వారి టెట్ హాల్ టికెట్లు విడుదల
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2025 JAN 2 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. సాంకేతిక సమస్య వల్ల JAN 11న ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు రేపు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ పేర్కొంది.
News December 27, 2024
విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసన
AP: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా YCP నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ అని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గ్యారంటీలు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.
News December 27, 2024
కేటీఆర్ క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా
TG: ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం వరకు KTRను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.